Wednesday, August 31, 2011

సింగూరు సంగతులు (వెతలు)


ఇదేదో పశ్చిమ బంగాలో ఉన్న సింగూరు కాదు....మన తెలుగు రాష్ట్రంలో, హైదరాబాదుకి 80కి.మీ. దూరంలో ఉన్న సింగూరు డ్యాం....

హైదరాబాదువాసులందరికి మంజీర నీరు సుపరిచితమే...కాని చాలామందికి తెలీదు అవి సింగూరు నుండి హైదరాబాదుకి వస్తాయని...

ఇంతకీ సింగూరు డ్యాం 1989లో మంజీరా నదిపై కట్టారు, మొదట్లో ఈ డ్యాం ఇరిగేషన్ కోసమే ప్లాన్ చేసారు, కాని తర్వాతి కాలంలో ఇది హైదరాబాద్ నగర వాసుల దాహార్తిని తీర్చే ప్రధాన నీటి వనరు అయ్యింది, సింగూరు డ్యాంకి మొత్తం పదిహేడు గేట్లు ఉన్నాయి..., అంతే కాకుండా 24 మెగావాట్ల విద్యుత్కేంద్రం కూడా ఉంది...

కారు నేర్చుకున్నాకా సెలవొస్తే చాలు ఎక్కడికైనా వెళ్ళడం అలవాటుగా మారింది., అందుకే నిన్న రంజాన్ సెలవుని ఇలా సింగూరుకి వెళ్ళాం... పొద్దున్నే ఎనిమిదిన్నరకి బయలుదేరి పటానచెరు, సంగారెడ్డి మీదుగా సింగూరు వెళ్ళాం, సంగారెడ్డి వరకు నేషనల్ హైవే అక్కడినుండి పది కి.మీ. డబల్ రోడ్డు, ఆపై 24 కి.మీ సింగల్ రోడ్డు.....మొత్తానికి పదింటి కంటే సింగూరు చేరుకున్నాము.

నేను ఇంతకుముందు ఎన్నో డ్యాంలు చూసిన దీనికొక ప్రత్యేకత ఉంది..ఎందుకంటే ఇంతగా ఎంజాయ్ చేసిన ట్రిప్ వేరేది లేదు...ప్రతి గాటు దగ్గరికి వెళ్లి చూడగలిగాం, డ్యాంలో నీరు నిండుగా ఉన్న చాల దగ్గరగా డ్యాం పరికరాలు, పనితీరు చూసాం.. సింగూరులో నెమళ్లు కూడా ఉన్నాయి.. అడవుల్లో తిరిగినట్టు చాలా స్వేచ్చగా తిరుగుతున్నాయి.... 

డ్యాం పక్కనే ఉన్నపార్కులో బోజనాలు చేసి, అక్కడే నదిలో స్నానాలు చేసాం..... పక్కనే సరస్వతీ దేవి విగ్రహం, శివ లింగము, నంది లాంటి కొన్ని విగ్రహాలు ఎలాంటి పూజలు లేకుండా పడేసారు... చూసేసరికి బాధేసింది.... దీనిని  ఎలాగైనా హైలైట్ చేయాలి...... దానిపై ఒక ప్రత్యేక టపా రాస్తున్నాను..

ఇంతకీ వెతలేంటి అంటే సింగూరులో పాలకుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది,  దేవుళ్ళ విగ్రహాలు అలా రోడ్డు పక్కనే పడేయ్యడంతో మొదలు పెడితే, డ్యాం నిర్వహణ, విద్యుత్కేంద్రం నిర్వహణ, టూరిజం అభివృద్ధి  ఇలా ప్రతీ విషయంలో పాలకులు సింగూరుని పూర్తిగా నిర్లక్ష్యం చేసారు, దృష్టి పెడితే దీనిని అద్బుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయవచ్చు.......దీనివల్ల గవర్నమెంటు కి ఆదాయంతో పాటు అక్కడి ప్రజలకు ఉపాధి కూడా కల్పించవచ్చు.... 

No comments:

Post a Comment