ఏంటి మొదటి పోస్ట్ మంజీరా తో మొదలు పెట్టి, రెండుకొచ్చేసరికి సినిమా డైలాగు చెప్పేసి, ముచ్చటగా మూడు లో ప్రేమ గురించి లెక్చర్లేంటి అంటారా..... ఇది లెక్చర్ కాదు నిజం...... నేను చూసిన ఒక నిజం......
సండేరోజు సూరీడు మండే వరకు నిద్ర లేవని నేను ఆ రోజు మాత్రం కోడికూయకముందే నిద్రలేచి రెడీ అయ్యి రైల్వేస్టేషన్ కి వచ్చినది ఎందుకంటే గోదారిలో (గోదావరి ఎక్స్ ప్రెస్) నా ఫ్రెండు శ్రావ్య మొదటిసారి హైదరాబాదు వచ్చింది.... నేను వైజాగెల్లినప్పుడు ఎప్పుడు మన రిసీవింగ్ కి రాకపోయినా నేను మాత్రం హైదరాబాదు ప్రతిష్ట నిలబెట్టాలని ఎప్పుడు లేవంది తెల్లారే లేచి స్టేషన్ కెల్లా.....ఇంతకీ ఈ శ్రావ్య ఎవరంటారా... ఇదో పెద్ద కథ....తర్వాతా టపాల్లో ఎప్పుడైనా డీటైల్ గా రాస్తాను....
నా దురదృష్టం కొద్దీ (సారీ అదృష్టం అనుకుంటా, నేను స్టేషన్ కి అరగంట లేటుగా వెళ్ళా) పొగమంచు వల్ల గోదారి గంట లేటుగా వచ్చింది, కాకపోతే బాలెన్సు అరగంటలోనే స్టోరీ అంతా జరిగింది (చూడాలని ఉంది మాత్రం కాదు), మనకి ఖాళీగా ఉండటం ఎంతమాత్రం నచ్చాడు అందుకే బుక్స్ షాపుకెళ్ళి ఈనాడు పేపరు తీసుకొని 2nd వెయిటింగ్ హాల్లో కూర్చున్నా, ఇంతలో ఒక తీయని, మధురమైన గొంతొకటి " ఎక్స్యూస్ మి" అని పిలిచింది... ఇంత శ్రావ్యమైన పిలుపు మన శ్రావ్యది కాదే అన్న అనుమానంతోనే పేపరులోంచి తల తీసి చూసా (ప్లీజ్ ఈ విషయం మా శ్రావ్యతో మాత్రం చెప్పొద్దు)..........
నా పక్క బెంచీలో/కుర్చీలో ఒక అందమైన అమ్మాయి నన్నే చూస్తూ ఉంది, ఒక్క సారిగా కిక్ సినిమాలో బ్రహ్మానందంలా అయిపోయా, బ్యాక్ గ్రౌండ్ లో తమన్ మ్యూజిక్ వినపడింది.
"ఎస్" అన్నాను వెంటనే...... ( కట్ చేస్తే ధూమ్ సినిమాలో ఉదయ చోప్రాలా, మల్లీశ్వరిలో వెంకటేష్ లా డ్రీమ్ సీక్వెన్సు ఈలోపే అయిపోయింది)
"ఒక్కసారి ఆ డిస్ట్రిక్ట్ ఎడిషన్ ఇస్తారా" అన్న మాట తో ఈలోకం లోకొచ్చా, ఏంటి ఇంతసేపు నేను మల్లీశ్వరి వెంకటేష్ లా డ్రీమ్ లోకి వెళ్ళింది దీనికేనా.... డిస్ట్రిక్ట్ ఎడిషన్ తనకిచ్చి పేపరు చాటుగా తనని గమనిస్తున్నా...
దీక్షగా గమనిస్తే తను పేపర్లో దేనికోసమో వెతుకుతున్నట్టు అనిపించింది...... మార్కెటింగు ప్రొఫెషన్లో ఐదేళ్ళ ఎక్స్పీరియెన్స్ వాళ్ళ తన ముఖం లోని భావాలను వెంటనే గుర్తించడం జరిగింది. కొంత చొరవ తీసుకొని ధైర్యం చేసి అడిగా " i think you are searching for something in the paper, can i help you in finding that"
వెంటనే తలెత్తి చూసింది ఆ అందమైన అమ్మాయి, ఆ చూపులో చాలా అర్దాలు కనిపించాయి.....
ఇంతకీ ఏం జరిగింది....జరగబోతుంది......రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం...........
No comments:
Post a Comment