Saturday, September 3, 2011

నాకు నచ్చిన ఒక పాట

అల్లంతదూరానా ఆతారక కల్లెదుట నిలచింద ఈ తీరుగా
అరుదైన చిన్నారిగా కోవెల్లో లేదేఇక..గుండెల్లో కొలువుండగా..
భూమికనలేదు ఇన్నాళ్ళుగా..ఈమెలా ఉన్న ఏభూమిక..
అరుదైన చిన్నారిగా కోవెల్లే లేదేఇక గుండెల్లో కొలు ఉండగా ..


కన్యాదనంగా ఈ సంబరం చేపట్టిన వరుడు శ్రీపతికాదా..
పొందాలనుకున్నా పొందే వీలుందా..అందరికి అందనిది సుందరి నీడా..
ఇందరి చేతులు పంచిన మమత..పచ్చగ పెంచిన పూలతా నిత్యం విరిసే నందనమవదా...
అందానికే అందమనిపించగా..దిగివచ్చెనే ఏమో దివి కానుకా
అరుదైన చిన్నారిగా కోవెల్లో లేదేఇక గుండెల్లో కొలువుండగా..

తన వయ్యారంతో ఈ చిన్నది లాగిందో ఎందరిని నిలబడనీకా
ఎన్నో వంపుల్తో పొంగే చిన్నది ఏమదిని ముంచిందో ఎవరికి ఎరుకా
తొలి పరిచయం ఒక తీయని కలగా..నిలిపిన హృదయమే సాక్షిగా
ప్రతిజ్ఞాపకం దీవించగా..చెలిజీవితం వెలిగించగా....?
అల్లంతదూరానా ఆతారక కల్లెదుట నిలచింద ఈ తీర

Wednesday, August 31, 2011

సింగూరు సంగతులు (వెతలు)


ఇదేదో పశ్చిమ బంగాలో ఉన్న సింగూరు కాదు....మన తెలుగు రాష్ట్రంలో, హైదరాబాదుకి 80కి.మీ. దూరంలో ఉన్న సింగూరు డ్యాం....

హైదరాబాదువాసులందరికి మంజీర నీరు సుపరిచితమే...కాని చాలామందికి తెలీదు అవి సింగూరు నుండి హైదరాబాదుకి వస్తాయని...

ఇంతకీ సింగూరు డ్యాం 1989లో మంజీరా నదిపై కట్టారు, మొదట్లో ఈ డ్యాం ఇరిగేషన్ కోసమే ప్లాన్ చేసారు, కాని తర్వాతి కాలంలో ఇది హైదరాబాద్ నగర వాసుల దాహార్తిని తీర్చే ప్రధాన నీటి వనరు అయ్యింది, సింగూరు డ్యాంకి మొత్తం పదిహేడు గేట్లు ఉన్నాయి..., అంతే కాకుండా 24 మెగావాట్ల విద్యుత్కేంద్రం కూడా ఉంది...

కారు నేర్చుకున్నాకా సెలవొస్తే చాలు ఎక్కడికైనా వెళ్ళడం అలవాటుగా మారింది., అందుకే నిన్న రంజాన్ సెలవుని ఇలా సింగూరుకి వెళ్ళాం... పొద్దున్నే ఎనిమిదిన్నరకి బయలుదేరి పటానచెరు, సంగారెడ్డి మీదుగా సింగూరు వెళ్ళాం, సంగారెడ్డి వరకు నేషనల్ హైవే అక్కడినుండి పది కి.మీ. డబల్ రోడ్డు, ఆపై 24 కి.మీ సింగల్ రోడ్డు.....మొత్తానికి పదింటి కంటే సింగూరు చేరుకున్నాము.

నేను ఇంతకుముందు ఎన్నో డ్యాంలు చూసిన దీనికొక ప్రత్యేకత ఉంది..ఎందుకంటే ఇంతగా ఎంజాయ్ చేసిన ట్రిప్ వేరేది లేదు...ప్రతి గాటు దగ్గరికి వెళ్లి చూడగలిగాం, డ్యాంలో నీరు నిండుగా ఉన్న చాల దగ్గరగా డ్యాం పరికరాలు, పనితీరు చూసాం.. సింగూరులో నెమళ్లు కూడా ఉన్నాయి.. అడవుల్లో తిరిగినట్టు చాలా స్వేచ్చగా తిరుగుతున్నాయి.... 

డ్యాం పక్కనే ఉన్నపార్కులో బోజనాలు చేసి, అక్కడే నదిలో స్నానాలు చేసాం..... పక్కనే సరస్వతీ దేవి విగ్రహం, శివ లింగము, నంది లాంటి కొన్ని విగ్రహాలు ఎలాంటి పూజలు లేకుండా పడేసారు... చూసేసరికి బాధేసింది.... దీనిని  ఎలాగైనా హైలైట్ చేయాలి...... దానిపై ఒక ప్రత్యేక టపా రాస్తున్నాను..

ఇంతకీ వెతలేంటి అంటే సింగూరులో పాలకుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది,  దేవుళ్ళ విగ్రహాలు అలా రోడ్డు పక్కనే పడేయ్యడంతో మొదలు పెడితే, డ్యాం నిర్వహణ, విద్యుత్కేంద్రం నిర్వహణ, టూరిజం అభివృద్ధి  ఇలా ప్రతీ విషయంలో పాలకులు సింగూరుని పూర్తిగా నిర్లక్ష్యం చేసారు, దృష్టి పెడితే దీనిని అద్బుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయవచ్చు.......దీనివల్ల గవర్నమెంటు కి ఆదాయంతో పాటు అక్కడి ప్రజలకు ఉపాధి కూడా కల్పించవచ్చు.... 

Sunday, August 21, 2011

ఆరుణోదయం


ఆరుణోదయం వూరుకోదు కిరణాలను ప్రసరించనిదే
వసంతోదయం వూరుకోదు పరిమళాలను పరచనిదే
ప్రవహించే నీరు వూరుకోదు పల్లములను తాకనిదే
ప్రతిఘటించే మనసు వూరుకోదు భావాలను ప్రకటించనిదే

ప్రేమంటే .............................1




ఏంటి మొదటి పోస్ట్ మంజీరా తో మొదలు పెట్టి, రెండుకొచ్చేసరికి సినిమా డైలాగు చెప్పేసి, ముచ్చటగా మూడు లో ప్రేమ గురించి లెక్చర్లేంటి అంటారా..... ఇది లెక్చర్ కాదు నిజం...... నేను చూసిన ఒక నిజం......


సండేరోజు సూరీడు మండే వరకు నిద్ర లేవని నేను ఆ రోజు మాత్రం కోడికూయకముందే నిద్రలేచి రెడీ అయ్యి రైల్వేస్టేషన్ కి వచ్చినది ఎందుకంటే గోదారిలో (గోదావరి ఎక్స్ ప్రెస్) నా ఫ్రెండు శ్రావ్య మొదటిసారి హైదరాబాదు వచ్చింది.... నేను వైజాగెల్లినప్పుడు ఎప్పుడు మన రిసీవింగ్ కి రాకపోయినా నేను మాత్రం హైదరాబాదు ప్రతిష్ట నిలబెట్టాలని ఎప్పుడు లేవంది తెల్లారే లేచి స్టేషన్ కెల్లా.....ఇంతకీ ఈ శ్రావ్య ఎవరంటారా... ఇదో పెద్ద కథ....తర్వాతా టపాల్లో ఎప్పుడైనా డీటైల్ గా రాస్తాను....

నా దురదృష్టం కొద్దీ (సారీ అదృష్టం అనుకుంటా, నేను స్టేషన్ కి అరగంట లేటుగా వెళ్ళా) పొగమంచు వల్ల గోదారి గంట లేటుగా వచ్చింది, కాకపోతే బాలెన్సు అరగంటలోనే స్టోరీ అంతా జరిగింది (చూడాలని ఉంది మాత్రం కాదు), మనకి ఖాళీగా ఉండటం ఎంతమాత్రం నచ్చాడు అందుకే బుక్స్ షాపుకెళ్ళి ఈనాడు పేపరు తీసుకొని 2nd వెయిటింగ్ హాల్లో కూర్చున్నా, ఇంతలో ఒక తీయని, మధురమైన గొంతొకటి " ఎక్స్యూస్ మి" అని పిలిచింది... ఇంత శ్రావ్యమైన పిలుపు మన శ్రావ్యది కాదే అన్న అనుమానంతోనే పేపరులోంచి తల తీసి చూసా (ప్లీజ్ ఈ విషయం మా శ్రావ్యతో మాత్రం చెప్పొద్దు)..........

నా పక్క బెంచీలో/కుర్చీలో ఒక అందమైన అమ్మాయి నన్నే చూస్తూ ఉంది, ఒక్క సారిగా కిక్ సినిమాలో బ్రహ్మానందంలా అయిపోయా, బ్యాక్ గ్రౌండ్ లో తమన్ మ్యూజిక్ వినపడింది.
"ఎస్" అన్నాను వెంటనే...... ( కట్ చేస్తే ధూమ్ సినిమాలో ఉదయ చోప్రాలా, మల్లీశ్వరిలో వెంకటేష్ లా డ్రీమ్ సీక్వెన్సు ఈలోపే అయిపోయింది) 

"ఒక్కసారి  డిస్ట్రిక్ట్ ఎడిషన్ ఇస్తారాఅన్న మాట తో ఈలోకం లోకొచ్చాఏంటి ఇంతసేపు నేను మల్లీశ్వరి వెంకటేష్ లా డ్రీమ్ లోకి వెళ్ళింది దీనికేనా.... డిస్ట్రిక్ట్ ఎడిషన్ తనకిచ్చి పేపరు చాటుగా తనని గమనిస్తున్నా...




దీక్షగా గమనిస్తే తను పేపర్లో దేనికోసమో వెతుకుతున్నట్టు అనిపించింది...... మార్కెటింగు ప్రొఫెషన్లో ఐదేళ్ళ క్స్పీరియెన్స్ వాళ్ళ తన ముఖం లోని భావాలను వెంటనే గుర్తించడం జరిగిందికొంత చొరవ తీసుకొని  ధైర్యం చేసి అడిగా " i think you are searching for something in the paper, can i help you in finding that"


వెంటనే తలెత్తి చూసింది  అందమైన అమ్మాయి,   చూపులో చాలా అర్దాలు కనిపించాయి.....



ఇంతకీ ఏం జరిగింది....జరగబోతుంది......రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం...........

Friday, August 19, 2011

నాకు బాగా నచ్చిన సినిమా డైలాగు

" మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్లూ, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్లూ, నలుగురులేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఏమీ ఉండదు.."

-నువ్వు నాకు నచ్చావ్ సినిమాలోది

Thursday, August 18, 2011

మంజీర

ఎవరి గజ్జెల రవళివే నీవు మంజీర
ఎవరి కజ్జల భాష్పధారవే మంజీర
నీవు పారిన దారిలో ఇక్షుదండాలు
నీవు జారిన జాడలో అమృతభాండాలు

నీవు దూకిన నేల మాకు విద్యున్మాల
నీవు ప్రాకిన పథము మాకు చైత్రరథమ్ము
ఎవరికొరకై పరుగులెత్తి వచ్చితివి
ఎవరిజూచి తటాకమై నిల్చిపోతివి

జీరలు పడ్డ నా గళము జేరి నవధ్వని జాలువార్చు మంజీరవు నీవు
నీవెలుగుచిందెడి చక్కని దేహవల్లి కే చీరలు కాస్క తేగలను చెప్పుము తెల్గునదీ
తెలుంగు బంగారపు రంగులద్దిన నిగారపు కావ్యదుకూలముల్ వినా..?

ఆకలి తీర్చుకున్న ఘనమైన మహయజనమ్ము కాన మీ లోకమునందు
మీ మనసులో నొకనాడు తదీప్సితమ్ము చీ కాకొనరింప వాకవయి,
కాలువవై, ఝురివై, తటాకమై మాకొర కేగుదలచితి సుమా..
కమనీయ పయోభరమ్మునన్

శిలగా నే గిరిసీమ డాగితివో మంజీరా
శతాబ్దాలు నిశ్చలవృత్తిన్ పలుకేని లేక నొక
వృక్షచ్ఛాయ దుష్టాత్మ గుండెలలో ద్వేషమువోలె ఇంచుకయినన్ హృద్యముగా
కిప్డు కన్నుల నీరై ఇటు జారినావు దయతోనో, ప్రేమభావాననో

నిను కరిగించి తెచ్చిన పునీతుడెవండతనిన్ భగీరథుండనవలె
వాడు నా తెలుగుటంగణమందలి ముండ్లదుబ్బులన్
తునియలు కొట్టి ఈ చెరుకుతోటలగూర్చి హలమ్ము గ్రుమ్మి,
భూమిని ప్రసరింపజేసి పసిమిన్ మిసిమిన్ పెకలించె దండిగా

ఆతదు నేలదున్ని బ్రతుకంతయు పస్తులు పన్న రైతు మా పోతన యేమొ
వాని వడపోతలలో కవితాప్రపంచ మా పాతమనోహరమ్మయిన పల్కు జగద్వీదితమ్ము
వాని సంగాతము నీకు కావ్యతను కల్పన చేసినదోయి, వాహినీ..

ఒకట నదివయి, ఒకచోట నొదిగి యొదిగి
సాగరమవై చలింపక సమసియుంటి
వెంత సౌమ్యస్వభావమోయీ,
పరుంగలిడు మనస్సును బంధింప దొడగినావు.

ఇందూరుమండలం బెందాక నీనీటి తడి తాకి తీయని తనము నొందు,
నా తెలంగాణమ్ము గీతనృత్తములతో నెందాక నిన్ను పూజించుచుండు,,
నెందాక నిరుపేదలంది నీ జలధార పండింత్రు కొల్లగా పైరుపంట,
లే కవీశులు నీ మహాకావ్యత నెరింగి తమ కలమ్ములకు సౌందర్య మిడుదు.

రంతదాక మహీమండలాంతరమున
నీ వెలుంగుకు రవ్వంత నీడ రాదు,
దివ్య గోదావరీ గృహాంతికమునండు
నీ విలాస మేనాటికి నిలిచిపోదు.

రుద్రవీణ తీవమాద్రి జుంజుమ్మని
తరగలెత్తి వచ్చుదాన నీవు,
నా మనస్సులోన నాదాలు కల్పించి
స్పందనమ్ము నేర్పజాలినావు.

నా తెలుగువీణ పోయిన మూర్ఛనలు నేడు
నీవుగా పారి నిండినవి నా భూమిలో,
ఇక ఎన్ని చెరుకు తోటలు పండనీచోట ?
ఎన్ని చ్క్కెరమిల్ల్లు లివురింపవు ?

ఎవ్వరే యెదురొచ్చి ఏడుపాయలు చేసి
రవ్వల్ల వీణపై రాగమొత్తిరి నిన్ను ?
ఏడుపాయల దుర్గ యేమన్నదే నిన్ను ?
యేమన్నదే నిన్ను ఏడుపాయల దుర్గ ?

ఏడుపాయల దుర్గ ఎదురుగా వచ్చింది
పాడుకొమ్మనాది పరుగులిడమన్నాది
స్వరమొక్కపాయగా సాగిపొమ్మన్నాది
బంగారు పండించి ప్రజలకిమ్మన్నాది

అదిగో హసంతికలు, అదె సుమ లలంతికలు
అదిగో సేమంతికలు, అదిగో వాసంతికలు
జయదాయకములు, సంశయ మాయకమ్ములు
ప్రియకరము లమృతపిచ్ఛిలము లుజ్జ్వలములు

మిట్టలెక్కి యెక్కి గుట్టలు దిగజారి
త్రోవ గడచి వచ్చినావి నీవు,
మిగుల శ్రమలుగొన్న మిసిమింతు రాలవు
సేదతీరుమీ ప్రసిద్ధభూమి




మహోంధ్రోదయంలో ధాశరథి గారు మంజీర నది గురించి రాసిన కవిత, మొన్న పాత పుస్తకాలు తిరగేస్తుంటే దొరికింది, నా బ్లాగు దీనితోనే మొదలు పెడదామని డిసైడు అయ్యి మీతో పంచుకుంటున్నాను